Author: ఆంధ్రా పల్స్

ఆంధ్రా పల్స్ – చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎఫ్డీసీ నూతన కమిటీలో చిలకలూరిపేట ప్రాంతానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కమిటీలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ప్రముఖులు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావుతో పాటు, నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు శివాజీ శొంఠినేని, యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు వి.సముద్రలకు ఈ కమిటీలో స్థానం లభించింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు సినీ రంగానికి చెందిన ప్రముఖులకు రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రాతినిధ్యం లభించడంతో నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ ప్రాంత వాసులకు ఈ గుర్తింపు దక్కడం పట్ల స్థానిక గ్రామస్తులు, అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More

‘లేపాక్షి’కి సాంకేతిక హంగులు హస్త కళారూపాల అమ్మకాల పెంపే లక్ష్యం తరంగా ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థ రూపకల్పన రాష్ట్ర స్థాయి నుంచే లేపాక్షి షో రూమ్ ల పర్యవేక్షణ ఏ రోజుకారోజు స్టాక్, అమ్మకాల వివరాల నమోదు స్టాక్ పై ఎప్పటికప్పుడు అలెర్ట్స్ ఇంటికే హస్త కళారూపాలు అందించేలా కళాక్షి వాట్సాప్ లింక్ రూపకల్పన ఏఐ టూల్ తో లింక్ లో హస్త కళల సమాచారం వాట్పాప్ లోనే హస్త కళలకు ఆర్డర్లు డోర్ డెలివరీ హస్త కళాకారులకు గౌరవ ప్రద జీవనమే లక్ష్యం : మంత్రి సవిత ఆంధ్రా పల్స్ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలకు నూతన ఊపిరి పోసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. లేపాక్షి షోరూమ్‌లను ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతూ, హస్తకళల అమ్మకాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ‘తరంగా’ అనే ఏఐ ఆధారిత రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పాటు…

Read More

ఆంధ్రా పల్స్ – విజయవాడ: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి, కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులను ట్రావెల్ హిస్టరీ ఆధారంగా పరీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్టు అథార్టీతో సమన్వయం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.…

Read More

పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO. కాంగో, ఉగాండాలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా. WHO హెచ్చరికలతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచన. అత్యవసరం అయితే తప్ప ఆయా దేశాలకు వెళ్లొద్దని సూచన. విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆరోగ్య నిఘా పెంపు. జ్వరంతో వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు.

Read More

17 జిల్లాల్లోని 174 మండలాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. మరో మూడు రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్న వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లా చిట్యాల మండలంలో 48.3 డిగ్రీలు నమోదు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన. – ఆంధ్రా పల్స్

Read More

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు ఆంధ్రా పల్స్ – కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు నొప్పులతో విలవిల్లాడుతుండగా, మిగిలిన ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. తెల్లవారుజామున వేళల్లో డ్రైవర్ అలసటకు గురై నియంత్రణ కోల్పోవడంతో బస్సు లారీని…

Read More

ఆంధ్రా పల్స్ – గుంటూరు: గుంటూరు నగరంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకంగా మారనున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2027 నాటికి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 6 పిల్లర్ క్యాప్స్ పూర్తయ్యాయని, వర్షాకాలం సమయానికి 30 పిల్లర్ల ఫౌండేషన్ పనులు పూర్తిచేశామని తెలిపారు. కార్మికుల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ప్రస్తుతం 70 మంది కార్మికులతో పనులు వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రాజెక్టు ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారులు…

Read More

ఆంధ్రా పల్స్ – గుంటూరు: దివ్యాంగులకు ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా పరిపాలన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ తెలిపారు. శనివారం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యోగులు, ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను సమగ్రంగా తెలుసుకొని, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి, తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి నెల నాలుగో శనివారం ఈ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్, అందిన అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు జారీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రీవెన్స్ ప్రాంగణంలో తాగునీరు, మజ్జిగ, కూలర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

Read More

ఆంధ్రా పల్స్ – అమరావతి: సాధారణ ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గమనార్హం ఏంటంటే, ఈ నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి. లీటర్ పెట్రోల్‌పై 97పైసలు, డీజిల్‌పై 99పైసలు పెంపు​. ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గుల ఆధారంగానే దేశీయంగా ఈ ధరల సవరణ జరిగినట్లు తెలుస్తోంది. సామాన్యుడి గుండెల్లో రైళ్లు ​నెల రోజులు కూడా గడవకముందే వరుసగా మూడు సార్లు ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​రవాణా ఛార్జీల భయం డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల రవాణా ఛార్జీలు పెరిగి, మార్కెట్లో వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని…

Read More

ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని బ్లాక్-2లో శుక్రవారం PNG గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా PNG కనెక్షన్ల పెంపు, సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై మంత్రి చర్చించారు. కనెక్షన్ల విస్తరణలో ఎదురవుతున్న అడ్డంకులు, అనుమతుల జాప్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు సురక్షితమైన, అందుబాటు ధరలో గ్యాస్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా PNG వినియోగాన్ని విస్తరించేందుకు సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

Read More