Author: ఆంధ్రా పల్స్

రైల్వే ఉద్యోగి అరెస్ట్  కర్నూలులో సంచలనం ఆంధ్రా పల్స్ – కర్నూలు:  కర్నూలు జిల్లాలో రైల్వే శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్ ఒకరు రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణికుల లగేజీ దొంగతనం చేస్తూ పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. అనంతపురం జిల్లా యడికి మండలానికి చెందిన పి. బాలరాజు 2013లో రైల్వేలో ఉద్యోగం ప్రారంభించి, 2023లో జూనియర్ ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందాడు. గత రెండేళ్లుగా అదోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ, అదే సమయంలో రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు దొంగతనం చేస్తూ వచ్చాడని పోలీసులు వెల్లడించారు. మే 14న నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఆర్మీ అధికారికి చెందిన బ్యాగు దొంగతనం జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలరాజును గుర్తించి కర్నూలులో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 198.5 గ్రాముల బంగారు నగలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల,…

Read More

పిడుగురాళ్లలో ఎంప్లాయీస్ ట్రైన్‌కు స్టాపేజ్ ఆమోదం పల్నాడు జిల్లాకు కీలక రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (12796/12795) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్ ఇవ్వడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్, విజయవాడ ప్రయాణాలకు సరైన రైళ్లు లేక పల్నాడు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎంపీ ఈ సమస్యను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే స్టాపేజ్‌కు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణికులకు ఉపశమనం పిడుగురాళ్లలో ఈ ‘ఎంప్లాయీస్ ట్రైన్’ ఆగడం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద ఎత్తున లాభపడనున్నారు. రోజువారీ ప్రయాణం సులభమవడంతో పాటు, పల్నాడు ప్రాంత…

Read More

ఉన్నత వర్గాలే అవకాశాలన్నీ చేజిక్కించుకుంటే.. అదే వర్గంలో వెనుకబడిన వారికి అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన. తల్లిదండ్రులు ఐఎఎస్ అధికారులైతే, పిల్లలకు రిజర్వేషన్ కోటా ఎందుకు? సామాజికంగా, ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడిన కుటుంబాలు పదేపదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం ఎంతవరకు సమంజసం? రిజర్వేషన్ల ఫలాలు తరతరాలుగా కొందరికే పరిమితం కాకుండా, సమాజంలో కింది స్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాలి. : సుప్రీంకోర్టు ధర్మాసనం

Read More

Gen Z యువతలో నిన్నటి నుంచీ రాజకీయంపై సరికొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. ట్రెండింగ్ రీల్స్ నుండి డైలీ అప్‌డేట్స్ వరకు.. రాజకీయం ఒక్కసారిగా యువత చర్చల్లోకి వచ్చేసింది. దీనికంతటికీ కారణం ఒక్కడే.. అతనే అభిజీత్ దీప్కే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’ (కాక్‌రోచెస్)తో పోల్చిన తర్వాత, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP). ఈ పార్టీకి అభిజీత్ దీప్కేనే ప్రధాన సారథి. ఈ CJP పార్టీని ప్రారంభించిన రెండు రోజుల్లోనే 40వేల మందికి పైగా సభ్యులు ఇందులో చేరారు. అంతే కాదు, సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్‌లను కూడా ఈ పార్టీ ఇప్పటికే తమ సభ్యులుగా చేర్చుకోవడం విశేషం. ఎవరీ అభిజీత్ దీప్కే? అభిజీత్ దీప్కే.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు. ఆయన…

Read More

రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే…!! ఆంధ్రా పల్స్ – అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే ‘రోహిణి కార్తె’ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగ మండనున్నాయి. ‘రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా…!?’ వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెతను వాడుకలోకి తెచ్చారు. వ్యవసాయ…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు వేగం పెరుగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఆధ్వర్యంలో పలు డిపోలు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు మారుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు–2, నెల్లూరు–2 డిపోలు తమ డీజిల్ బస్సులను ఇతర డిపోలకు తరలించి, ఎలక్ట్రిక్ బస్సుల డిపోలుగా మారె దిశగా ముందుకు సాగుతున్నాయి. మంగళగిరి డిపోలో ఇప్పటికే సగానికి పైగా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మర్చినట్లుగా సమాచారం. అనంతపురం, కడప, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి, కర్నూలు, సింహపురి, గాజువాక డిపోలలో ప్రతి డిపోకి 50 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గుంటూరు-2, నెల్లూరు-2, విద్యాధరపురం డిపోలలో ప్రతి డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రయాణికులకు ప్రశాంతమైన ప్రయాణ అనుభవం కల్పించడం లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Read More

ఆంధ్ర పల్స్ – అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత సోమవారం వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మే 22, శుక్రవారం నాటికి జిల్లాల వారీగా ఉష్ణోగ్రతల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని అంచనా. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం,…

Read More

ఏపీలో 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు రికార్డయ్యాయి. మొత్తం 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Read More

విలేజ్ సర్వేయర్, వీఆర్‌ఓ సస్పెన్షన్ ఆంధ్రా పల్స్ – నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్ మరియు వీఆర్‌ఓ వెంకయ్యలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ​పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ​బాధితుల నుంచి ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ​రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కథనంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.

Read More

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం ఆంధ్రా పల్స్ – గుంటూరు:  గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాష్ నగర్ 3వ లైన్ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కు ఉపయోగించే పైపులకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి  చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇన్నర్ రింగ్ రోడ్ పరిసరాల్లో మంటలు కనిపించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పైపులు కాలిపోతుండటంతో దట్టమైన పొగ ఎగసిపడింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Read More