ఒకే వేదికపై మెరిసిన సీఎం చంద్రబాబు, విజయ్ తెలుగు గంగ, కృష్ణ – గోదావరి – కావేరి అనుసంధానంపై చర్చ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ పున్నమి ఘాట్‌లో ఇద్దరు సీఎంలకు అభిమానులు, ప్రజల నుంచి భారీ స్పందన ఆంధ్రా పల్స్ – విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి సాక్షిగా, కృష్ణా నదీ తీరంలో జరుగుతున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం విజయవాడలో ఆవిష్కృతమైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒకే వేదికను పంచుకున్నారు. అక్టోబర్ 13 సాయంత్రం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు సీఎం విజయ్‌కు, చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకలకు ముందుగా ఇరువురు ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశమై కీలక…
Author: ఆంధ్రా పల్స్
మీడియా అవగాహన సదస్సు నిర్వహణ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా వారధిలా కీలక పాత్ర పోషిస్తుంది యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి డెవలప్మెంటల్ జర్నలిజం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఆంధ్రా పల్స్ – శ్రీకాకుళం: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) విజయవాడ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ జి.సురేష్ కుమార్ శ్రీకాకుళంలో జిల్లా, గ్రామీణ విలేకరుల కోసం ఒక రోజు ‘పిఐబి వార్తాలాప్’ మీడియా అవగాహన సదస్సును ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంతో పాటు, అభివృద్ధి సంబంధిత జర్నలిజం, విజయగాథల కవరేజ్, సోషల్ మీడియా మెళకువలు, నకిలీ సమాచారాన్ని నిరోధించడం, పత్రికా సమాచార కార్యాలయ పని తీరుపై అవగాహన కల్పించేందుకు విజయవాడ పిఐబి ప్రాంతీయ కార్యాలయం ఈ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో జర్నలిస్టులను ఉద్దేశించి…
నిరంతర పర్యవేక్షణ ప్రభావిత జిల్లాల యంత్రాంగంతో సమన్వయం తుఫాను గమనంపై ఎప్పపటికప్పుడు సమాచారం చేరవేత ఆంధ్రా పల్స్ – అమరావతి: ఉత్తరాంధ్రపై తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సచివాలయంలోని రియల్ టైమ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి వాతావరణ మార్పులను, జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్లు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తుపాన్ కదలికలను అవేర్ విభాగం ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో ట్రాక్ చేసి, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. ఏఏ ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది, రిజర్వాయర్లు పరిస్థితి, వాటి క్యాచ్‌మెంటు ఏరియాల్లో ఎంత నీరు రావచ్చు తదితర వివరాలును జిల్లాలకు ఎప్పటికప్పుడు చేరవేసి అప్రమత్తం చేస్తున్నారు. తుఫాను కళింగపట్నం వద్ద…
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ‘నవ గుంటూరు – గ్రీన్ గణేశ’ ఒకే సమయంలో 25,000 మంది విద్యార్థులతో మట్టి వినాయకుల తయారీ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జీఎంసీకి దక్కిన స్థానం భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నగర పాలక సంస్థ ఆంధ్రా పల్స్ – గుంటూరు: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవ గుంటూరు – గ్రీన్ గణేశ’ కార్యక్రమం సరికొత్త చరిత్ర సృష్టించింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), ప్రమాదకర రసాయన రంగుల విగ్రహాల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా నగరంలోని 55 పాఠశాలలకు చెందిన 25,000 మంది విద్యార్థులు ఒకే సమయంలో ఏకకాలంలో పర్యావరణహిత మట్టి గణపతులను తయారు చేశారు. ఈ అద్భుత ఘనతను గుర్తించిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారిక…
డాక్టర్ పి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స లాప్రోస్కోపిక్ సర్జరీతో ప్రాణాలు కాపాడిన మాతాశ్రీ ఆసుపత్రి వైద్యులు రెండోసారి కూడా మింగిన మహిళా ఆంధ్రా పల్స్ – నరసరావుపేట: పల్నాడు జిల్లా పెట్లవారిపాలెంకు చెందిన ఓ మహిళ పొత్తికడుపులోకి చేరిన పెన్నులు, చెక్క స్పూన్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా బయటకు తీశారు. నరసరావుపేటలోని మాతాశ్రీ ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. బాధిత మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ మాతాశ్రీ ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించగా, పొత్తికడుపులో విదేశీ వస్తువులు ఉన్నట్లు గుర్తించి విస్తుపోయారు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పెన్నులు, చెక్క స్పూన్లను మింగినట్లు గుర్తించారు. పరిస్థితి విషమించకముందే డాక్టర్ పి. రామచంద్రారెడ్డి బృందం తక్షణమే స్పందించి, ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే అధునాతన లాప్రోస్కోపిక్…
మంత్రి వర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆంధ్రా పల్స్ – అమరావతి: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రభుత్వం తరపున వెంటనే సీఆర్డీఏ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వంలో సంబంధిత మంత్రివర్గ ఉప సంఘం ముందుంచి తదుపరి చర్యలకు మార్గం సుగమం చేస్తామని స్పష్టం చేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు సోమవారం సురేష్ కుమార్‌ను కలిసి, సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ నుంచి పొందిన న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని సమర్పించారు. జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన న్యాయ పరమైన, విధాన…
ప్రమాదంలో మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఆంధ్రా పల్స్ – విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించిందని, పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి వెల్లడించారు. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖ జర్నలిస్టు ఫోరం ప్రెస్‌క్లబ్‌కు విచ్చేసిన మంత్రి కొలుసు పార్థసారథిని జర్నలిస్టులు కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై మంత్రితో చర్చించారు. ఇందుకు సంబంధించి మంత్రికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణతో పాటు జర్నలిస్టులకు నివాస స్థలాల కేటాయింపు అంశాలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రెండు రోజుల…
ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కొత్త ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచి, వాటి ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రాజకీయ లాబీయింగ్ లకు పూర్తిగా తెరపడనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం ఆటో డిజిటలైజేషన్‌తో మహిళలకు మరింత భద్రత క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డ్రైవర్ వివరాలు చేతిలోకి 311 మంది ఆటో డ్రైవర్లకు క్యూఆర్ స్టిక్కర్ల పంపిణీ ప్రజల రక్షణే లక్ష్యంగా వినూత్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఆంధ్రా పల్స్ – మంగళగిరి: ప్రయాణికుల భద్రత, రక్షణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆటో డిజిటలైజేషన్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద 311 మంది ఆటో డ్రైవర్లకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు, సూచనల మేరకు స్థానిక ఆటో డ్రైవర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణికులు కూర్చునే సీటు…
ఆంధ్రా పల్స్ – విజయవాడ: జగ్గయ్యపేట నుండి విజయవాడ వెళ్లే జగ్గయ్యపేట డిపో ఆర్టీసీ బస్సు గొల్లపూడి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంజన్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోనీ ప్రయాణికులు అందరినీ కిందకు దించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారూ. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
