ఆంధ్రా పల్స్ – సత్తెనపల్లి: సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్‌కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడింది. ఈ సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన యువకుడు ఐపీఎస్‌గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువత ప్రత్యూష్‌కు అభినందనలు తెలిపారు. శిక్షణ అనంతరం రాష్ట్రంలో సేవలందించనున్న ప్రత్యూష్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు
Author: ఆంధ్రా పల్స్
తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితలకు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు. కారుణ్య నియామకాలకు వివాహిత కూతుళ్లు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు. తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకానికి వివాహిత కూతుళ్లు అర్హులు. వైవాహిక స్థితి ఆధారంగా హక్కులను కాలరాయలేరు. : సుప్రీంకోర్టు ధర్మాసనం
బాపట్ల జిల్లాలో ఎస్ఐల బదిలీలు ఎం.వెంకటేశ్వర్లు – చీరాల టూ టౌన్ to వెదుళ్ళపల్లి కె మాధవరావు – విఆర్ to చందోలు అబ్దుల్ రెహమాన్ – విఆర్ to సిసిఎస్ బాపట్ల వి.సుబ్బారావు – విఆర్ to సిసిఎస్ బాపట్ల ఎం.శివయ్య – భట్టిప్రోలు to చౌడయ్యపాలెం డి.చెన్నకేశవులు – విఆర్ to నగరం బి.భార్గవ్ – నగరం to విఆర్ పి.అనిల్ కుమార్ – చీరాల వన్ టౌన్ to చుండూరు కె.అమీర్ – విఆర్ to భట్టిప్రోలు సిహెచ్ చంద్రావతి – చుండూరు to విఆర్ ఎం.రామాంజనేయులు – విఆర్ to ఈపురుపాలెం టి.శ్రీనివాసరావు – విఆర్ to చీరాల వన్ టౌన్ ఏ.చంద్రశేఖర్ – ఈపురుపాలెం to విఆర్ – ఆంధ్రా పల్స్
ఆంధ్రా పల్స్ – విజయవాడ: న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీఐసీ) ప్రత్యేక అధికారిగా తేళ్ల కస్తూరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న కస్తూరి, ఏపీఐసీ ప్రత్యేక అధికారి పూర్తి అదనపు బాధ్యతలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తూన పి. కిరణ్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆ బాధ్యతలను తేళ్ల కస్తూరికి బదలాయించారు. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి జారీ అయిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం కస్తూరి న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారి హోదాలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తేళ్ల కస్తూరి, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తేళ్ల కస్తూరి సేవా…
ఆంధ్రా పల్స్ – హైదరాబాద్: హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో తెలగ కాపు బలిజ సంఘం నూతన భవన నిర్మాణానికి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ రూ.30 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని ఆయన తన తండ్రి, కీర్తిశేషులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థంగా అందించడం విశేషం. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు అయిన ఏ.వి. రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్, చలువాది రవి, విద్యాసాగర్, సుంకర వెంకటేశ్వరరావు, శివాజీ తదితరులకు చెక్కును అందజేశారు. అల్లు అరవింద్ సేవా మనోభావాన్ని సంఘ సభ్యులు ప్రశంసిస్తూ, వారి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ భవన నిర్మాణానికి ఈ విరాళం కీలక సహాయంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
1,400 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి 268 పంచాయతీల్లో ప్రత్యేక చర్యలు మరో 6 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్ర లక్ష్యం ఆంధ్రా పల్స్ – పల్నాడు: పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి చెత్త నిర్వహణ విధానాలను సమీక్షించారు. చెత్తను పద్ధతిగా సేకరించి, విద్యుత్తుగా మారుస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలు కూడా తీర్చవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 7,200 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, కొండవీడు ప్లాంట్ 1,400 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో కూడా ఇలాంటి ప్లాంట్ విజయవంతంగా పనిచేస్తోందన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 268 పంచాయతీల్లో చెత్త నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నదిలోకి వ్యర్థాలు చేరకుండా కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు…
ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. “ఒక జిల్లా – ఒక థీమ్” విధానంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రాజధాని అమరావతిలో 25 వేల మందితో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తారు. కృష్ణా నదిపై నిర్మితమైన బ్రిడ్జిపై యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో ఒక్కో చోట వెయ్యి మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంత్రులు, జిల్లా అధికారులు పాల్గొంటారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కోటి మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలోని 1.5 లక్షల ట్రైనర్లతో పాటు మరో లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నారు. యోగాంధ్ర నిర్వహణకు ప్రతి జిల్లాకు…
ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. 18 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద సుమారు రూ.22 వేల కోట్ల ప్రణాళిక సిద్ధమైంది. శుక్రవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరణపై అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,261 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు, 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు పూలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాలు ఇందుకు ఎంపికయ్యాయి. మొత్తం 18 గిగావాట్లలో 11 గిగావాట్లు సోలార్ ద్వారా, 7 గిగావాట్లు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి కానున్నాయి. భవిష్యత్తులో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఈ కారిడార్ కీలకమని సీఎం పేర్కొన్నారు. సోలార్ కార్యక్రమాలకు వేగం రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలపై 200 మెగావాట్ల…
ఆంధ్రా పల్స్ – పల్నాడు: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ దండయాన” కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం అమలవుతోంది. మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో మహిళల అవగాహన కోసం ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేసి, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, భద్రత అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో 2,942 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈవ్ టీజింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ల…
బహిరంగ మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయం ప్రాధాన్య వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ధరల స్థిరీకరణ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ధరల స్థిరీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పప్పులు, బియ్యం, వంటనూనెలు, టమోటా, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్‌సేల్ ధరలపై…
