ఆంధ్రా పల్స్ – గుంటూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన “యోగాంధ్ర-2026” సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఏడాది “Yoga for Healthy Aging” నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న గుంటూరు వెస్ట్రన్ బైపాస్‌పై సుమారు 25 వేల మంది పాల్గొనేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా పట్ల ఆసక్తి ఉన్న ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూన్ 7 నుంచి 20 వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రదేశాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు…
Author: ఆంధ్రా పల్స్
ఫోన్ స్క్రీన్‌పైనే ‘ఫేక్ కాల్’ అలర్ట్. ఏఐ (AI) సాంకేతికతతో గూగుల్ సరికొత్త ఆవిష్కరణ. ఇకపై ఆన్లైన్ మోసాలకు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు చెక్. సంభాషణను బట్టే మోసాన్ని కనిపెట్టే సరికొత్త ఏఐ (AI) సాంకేతికత. ఆంధ్రా పల్స్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, నకిలీ ఫోన్ కాల్స్ (ఫేక్ కాల్స్) బారిన పడి సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్న నేపథ్యంలో, ప్రముఖ టెక్ దిగ్గజం ‘గూగుల్’ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ఆధారంగా పనిచేసే సరికొత్త ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ (Fake Call Detection) ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ సరికొత్త సాంకేతికతతో వినియోగదారులకు సైబర్ వల నుంచి శాశ్వత ఉపశమనం లభించనుంది. సంభాషణను బట్టి హెచ్చరించే ఏఐ (AI) టెక్నాలజీ సాధారణంగా వచ్చే స్పామ్ కాల్స్ కేవలం నంబర్ ఆధారంగా బ్లాక్ అవుతుంటాయి. కానీ, గూగుల్ తీసుకువచ్చిన…
టెర్మినల్-1ను పరిశీలించిన ప్రధానమంత్రి ఆంధ్రా పల్స్ – కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 (T1) పై జరిగిన డ్రోన్ దాడి అనంతరం కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా బుధవారం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ హమౌద్ అల్-ముబారక్‌తో కలిసి ఆయన విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంలో సంభవించిన మరణాలు, గాయపడిన వారి వివరాలను, అలాగే విమానాశ్రయ సౌకర్యాలకు జరిగిన భారీ ఆస్తి నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక సాంకేతిక అంచనా నివేదికను ప్రధానమంత్రి పరిశీలించారు. విమానాశ్రయంలో పనిచేసే సిబ్బంది మరియు అక్కడి ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. దెబ్బతిన్న టెర్మినల్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించి, విమాన రాకపోకలకు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన విమానాశ్రయ సిబ్బందిని, అత్యవసర సహాయక…
ఆంధ్రా పల్స్ – గుంటూరు: అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) వ్యవస్థను సమగ్రంగా ఏర్పాటు చేయడానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాన జంక్షన్ల ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణలో సమర్థత పెంచేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రజా సేవలు అందించడం, పరిశుభ్రమైన మరియు సుందరమైన నగర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గుంటూరు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
తనపై అత్యాచారం చేశాడని సిఐ చిన్న మల్లయ్యపై వినుకొండలో మహిళ ఫిర్యాదు. ఏప్రిల్ 29న సిఐ చిన్న మల్లయ్యపై వినుకొండలో మహిళ ఫిర్యాదు. మహిళ ఫిర్యాదుతో వినుకొండలో సిఐ చిన్నమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు. కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్న మల్లయ్య. సిఐ చిన్న మల్లయ్యని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగిస్తూ ఐజి ఉత్తర్వులు జారీ. పల్నాడు జిల్లా ఎస్పి కార్యాలయానికి చేరిన మల్లయ్య డిస్మిస్ ఉత్తర్వులు. వినుకొండ, నరసరావుపేట, కారంపూడిలో సిఐగా పనిచేసిన మల్లయ్య.
ఆంధ్రా పల్స్ – అమరావతి: విమర్శలు, దుష్ప్రచారం తప్ప కొన్ని రాజకీయ పార్టీలకు మరో పని లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి, అసత్యాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకంలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టామని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కేటగిరీల ప్రకారం ఈ నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండానే కొందరు విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్మాణాత్మక నిర్ణయాన్నీ విమర్శించడం సరైంది కాదని సీఎం పేర్కొన్నారు.…
స్పిల్ వే కు దిగువన బ్రిడ్జి నిర్మాణానికి షెడ్యూల్. ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రిలకు కలుపుతూ హైవే కనెక్టివిటీ. గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలి. అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, డిజైనర్స్ తో సమీక్ష. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆంధ్రా పల్స్ – అమరావతి: గోదావరి పుష్కరాలు–2027 నాటికి పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకు అనుగుణంగా 9,900 ఎకరాల విస్తీర్ణంలో లైడార్ సర్వే పూర్తిచేసి, లేఅవుట్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ప్రాజెక్టును ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రిలతో జాతీయ రహదారుల ద్వారా అనుసంధానించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. స్పిల్‌వే దిగువన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అనుమతులు త్వరితగతిన పూర్తిచేసి,…
ఆంధ్రా పల్స్ – గుంటూరు : వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటీలో ‘గూగుల్ జెమిని AI ల్యాబ్’ ఏర్పాటు. ఏపీలోనే మొట్టమొదటి AI ల్యాబ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏర్పాటు. విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీతో పాటు రైతులకు, ప్రజలకు ఉపయోగపడనున్న AI ల్యాబ్. ఏడాది పొడవునా, 24 గంటలూ (24/7) పనిచేయనున్న ‘గూగుల్ జెమిని AI ల్యాబ్’. ఈ ల్యాబ్‌ను ఏ కాలేజీ విద్యార్థులైనా ఉపయోగించుకోవచ్చని తెలిపిన చైర్మన్ లావు రత్తయ్య. విజ్ఞాన్ వర్శిటీ ఫ్యాకల్టీకి ‘జెమిని AI’ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్, విజ్ఞాన్ లో జెమిని AI సెంటర్ రావడం ఆనందదాయకం: విజ్ఞాన్ యూనివర్శిటీ ఛైర్మన్ లావు రత్తయ్య
స్బేర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి. యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించండి. ఎపిలో ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించండి. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్ తో మంత్రి లోకేష్ భేటీ. ఆంధ్రా పల్స్ – మాస్కో: రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని విస్తరించే దిశగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లోకేష్ మాట్లాడుతూ, వెస్ట్రన్ ప్లాట్‌ఫార్మ్‌లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎంను భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు విస్తరించాలని కోరారు. యూపీఐ నెట్వర్క్ భద్రతను బలోపేతం చేయడానికి స్బేర్ బ్యాంక్ అధునాతన వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ ఆధారిత…
ఆంధ్రా పల్స్ – విజయవాడ: నైరుతి రుతుపవనాలు-2026 అంచనాలు, ముందస్తు సన్నద్ధతపై భారత వాతావరణ శాఖ (IMD) మరియు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) సంయుక్తంగా మంగళవారం కీలక స్టేక్‌హోల్డర్స్ సమావేశాన్ని నిర్వహించాయి. గన్నవరం మండలం అడవినెక్కలలోని ఎన్ఐడిఎం సదరన్ క్యాంపస్‌లో జరిగిన ఈ సదస్సుకు IMD డైరెక్టర్ జనరల్ డా. ఎం. మహాపాత్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు హెచ్చరికలను సమర్థంగా వినియోగించి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించాల్సిన అవసరం ఉందని డా. మహాపాత్ర తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో రుతుపవనాల రాక, తీవ్రతలో మార్పులు వస్తున్నాయని, ఒకే సీజన్లో వరదలు-కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల వల్ల ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. తూర్పు కనుమల వద్ద ‘ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్’ కారణంగా ఉత్తర…
