- స్బేర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి.
- యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించండి.
- ఎపిలో ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించండి.
- స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్ తో మంత్రి లోకేష్ భేటీ.
ఆంధ్రా పల్స్ – మాస్కో: రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని విస్తరించే దిశగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

లోకేష్ మాట్లాడుతూ, వెస్ట్రన్ ప్లాట్‌ఫార్మ్‌లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎంను భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు విస్తరించాలని కోరారు. యూపీఐ నెట్వర్క్ భద్రతను బలోపేతం చేయడానికి స్బేర్ బ్యాంక్ అధునాతన వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ ఆధారిత యాంటీ-ఫ్రాడ్ వ్యవస్థలను సమన్వయం చేయాలని సూచించారు.
స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ సిస్టమ్‌లను ప్రవేశపెట్టాలని కోరారు. అంతేకాక, యువతకు ప్రపంచ స్థాయి కోడింగ్ శిక్షణ అందించేందుకు “స్కూల్ 21” అకాడమీలను భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

విశాఖపట్నం కేంద్రంగా ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు రూపాయి-రూబుల్ వాణిజ్య సౌకర్యాలు, వ్యవస్థీకృత రుణాలు అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ స్పందిస్తూ, భారత్‌లో తమ కార్యకలాపాలు న్యూఢిల్లీ, ముంబై శాఖల ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. బెంగళూరు ఐటీ హబ్ ద్వారా సరిహద్దు వాణిజ్య పరిష్కారాలు, రూపాయి-రూబుల్ యంత్రాంగానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

ద్వైపాక్షిక వాణిజ్యం, కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రెజరీ కార్యకలాపాలు, ఎఐ ఆధారిత డేటా విశ్లేషణలలో తమ బ్యాంక్ సేవలు అందిస్తున్నట్లు వివరించారు. లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
స్బేర్ బ్యాంక్:
రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న స్బేర్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, క్లౌడ్, ఎఐ రంగాల్లో విస్తరించిన ప్రముఖ సంస్థ. మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌కు 110 మిలియన్లకు పైగా రిటైల్, 3.5 మిలియన్ల కార్పొరేట్ ఖాతాదారులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.87 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 15.6 ట్రిలియన్ రూబుల్స్ ఆదాయం సాధించింది. 12 వేల శాఖల ద్వారా రోజూ 8 కోట్లకు పైగా డిజిటల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.


