ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. “ఒక జిల్లా – ఒక థీమ్” విధానంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
రాజధాని అమరావతిలో 25 వేల మందితో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తారు. కృష్ణా నదిపై నిర్మితమైన బ్రిడ్జిపై యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
జిల్లా కేంద్రాల్లో ఒక్కో చోట వెయ్యి మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంత్రులు, జిల్లా అధికారులు పాల్గొంటారు.
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కోటి మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలోని 1.5 లక్షల ట్రైనర్లతో పాటు మరో లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
యోగాంధ్ర నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.25 లక్షల నిధులు కేటాయించారు.
ఆరోగ్య, విద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్కులు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో యోగా సెషన్లు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని 56 టూరిస్టు కేంద్రాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేపడతారు. రోజుకు రెండు జిల్లాల్లో 500 మందితో యోగా నిర్వహణ ఉంటుంది.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యోగాంధ్ర ఈవెంట్స్‌కు అవార్డులు ఇవ్వనున్నారు.
యోగాపై అవగాహన కోసం మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన వీడియోలను పబ్లిక్ డొమైన్లో ఉంచనున్నారు. 90 ఆసనాలు, 21 ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక యోగా, ప్రాణాయామ వీడియోలు అందుబాటులో ఉంటాయి.
8142404888 నెంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

