ఏపీ క్యాడర్‌కు సత్తెనపల్లి యువకుడు
ఆంధ్రా పల్స్ - సత్తెనపల్లి: సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్‌కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడింది. ఈ సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన యువకుడు ఐపీఎస్‌గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువత ప్రత్యూష్‌కు అభినందనలు తెలిపారు. శిక్షణ అనంతరం రాష్ట్రంలో సేవలందించనున్న ప్రత్యూష్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు