ఆంధ్రా పల్స్
Date of Publish : 29 May 2026, 5:40 pm Posted by : ఆంధ్రా పల్స్

అంతర్జాతీయ వేదికపై మెరిసిన గుంటూరు జిల్లా యువ క్రీడాకారులు

ఆంధ్రా పల్స్ – గుంటూరు: చైనాలో జరిగిన సబ్ జూనియర్ & జూనియర్ ఏషియన్ ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. తెనాలి ప్రాంతానికి చెందిన ఇ. లక్ష్మి వినయశ్రీ మరియు మదిన షారూ బ్రాంజ్ పతకాలు సాధించి జిల్లా గర్వాన్ని పెంచారు.

అలాగే సబ్ జూనియర్ నేషనల్ విభాగంలో బి. లిఖిత బ్రాంజ్ మెడల్ సాధించి ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయాలు జిల్లా క్రీడా రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ఐఏఎస్  క్రీడాకారులను, వారి కోచ్‌లను అభినందించారు. క్రమశిక్షణతో సాధన చేస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.

స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు విజేతలను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.