ఘనంగా యోగాంధ్ర-2026
ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. “ఒక జిల్లా – ఒక థీమ్” విధానంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రాజధాని అమరావతిలో 25 వేల మందితో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తారు. కృష్ణా నదిపై నిర్మితమైన బ్రిడ్జిపై యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో...