ఏపీలో 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఏపీలో 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు రికార్డయ్యాయి. మొత్తం 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ...