ఆంధ్రా పల్స్ – గుంటూరు: దివ్యాంగులకు ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా పరిపాలన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ తెలిపారు.
శనివారం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యోగులు, ఎస్సి, ఎస్టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను సమగ్రంగా తెలుసుకొని, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి, తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రతి నెల నాలుగో శనివారం ఈ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్, అందిన అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు జారీ చేశారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రీవెన్స్ ప్రాంగణంలో తాగునీరు, మజ్జిగ, కూలర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.