నైరుతి రుతుపవనాలు – 2026 ప్రాణనష్టం తగ్గించాలి: IMD డీజీ పిలుపు

ఆంధ్రా పల్స్ - విజయవాడ: నైరుతి రుతుపవనాలు-2026 అంచనాలు, ముందస్తు సన్నద్ధతపై భారత వాతావరణ శాఖ (IMD) మరియు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) సంయుక్తంగా మంగళవారం కీలక స్టేక్‌హోల్డర్స్ సమావేశాన్ని నిర్వహించాయి. గన్నవరం మండలం అడవినెక్కలలోని ఎన్ఐడిఎం సదరన్ క్యాంపస్‌లో జరిగిన ఈ సదస్సుకు IMD డైరెక్టర్ జనరల్ డా. ఎం. మహాపాత్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు హెచ్చరికలను సమర్థంగా వినియోగించి ప్రాణ, ఆస్తి నష్టాలను...