ఆంధ్రా పల్స్
Date of Publish : 24 May 2026, 2:29 am Posted by : ఆంధ్రా పల్స్

2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి : కేంద్ర మంత్రి పెమ్మసాని

ఆంధ్రా పల్స్ – గుంటూరు: గుంటూరు నగరంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకంగా మారనున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2027 నాటికి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 6 పిల్లర్ క్యాప్స్ పూర్తయ్యాయని, వర్షాకాలం సమయానికి 30 పిల్లర్ల ఫౌండేషన్ పనులు పూర్తిచేశామని తెలిపారు.

కార్మికుల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ప్రస్తుతం 70 మంది కార్మికులతో పనులు వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రాజెక్టు ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారులు నిరంతర పర్యవేక్షణతో పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.