తుఫాను పై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ ఆంధ్రా పల్స్ - అమరావ‌తి: ఉత్త‌రాంధ్ర‌పై తుఫాన్ ప్ర‌భావం నేప‌థ్యంలో స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్త‌మైంది. ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి వాతావ‌ర‌ణ మార్పుల‌ను, జిల్లాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను ఆర్టీజీఎస్ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిస్థితిని స‌మీక్షించారు. వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, తుపాన్...