పల్నాడు జిల్లాలో “ఆపరేషన్ దండయాన” పటిష్ట అమలు
ఆంధ్రా పల్స్ - పల్నాడు: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ దండయాన” కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం అమలవుతోంది. మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు...