ఏపీఎఫ్డీసీ కమిటీలో పేట వాసులు
ఆంధ్రా పల్స్ - చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎఫ్డీసీ నూతన కమిటీలో చిలకలూరిపేట ప్రాంతానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కమిటీలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ప్రముఖులు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావుతో పాటు, నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు శివాజీ శొంఠినేని, యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు వి.సముద్రలకు ఈ కమిటీలో స్థానం లభించింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు సినీ రంగానికి చెందిన ప్రముఖులకు రాష్ట్ర...