పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆంధ్రా పల్స్ - పల్నాడు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. నంద్యాల జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు...