ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి
ఆంధ్రా పల్స్ - గుంటూరు: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, వాటిని సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ, సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్,...