విద్యుత్ అంతరాయాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాల సమస్యపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ విజయానంద్ వర్చువల్గా హాజరయ్యారు. ట్రాన్స్కో జేఎండీ, డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలి వానల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు వివరించారు. విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు సమయానుకూల సమాచారం అందించేందుకు మీడియా, బల్క్...