ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాల సమస్యపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ విజయానంద్ వర్చువల్గా హాజరయ్యారు. ట్రాన్స్కో జేఎండీ, డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలి వానల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు వివరించారు.

విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు సమయానుకూల సమాచారం అందించేందుకు మీడియా, బల్క్ మెసేజింగ్ వ్యవస్థలను ఉపయోగించాలని మంత్రి ఆదేశించారు. అలాగే 1912 కాల్ సెంటర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కాల్ సెంటర్లు ప్రజలకు మరియు విద్యుత్ శాఖకు మధ్య సమన్వయకర్తగా పనిచేయాలని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచేందుకు నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్ల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సబ్స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచుతూ అప్గ్రేడ్ చేయాలని సూచించారు.
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించిన మంత్రి, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం అదనపు సీపీటీ గ్యాంగులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.