తెనాలి ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం: భద్రతా లోపాలపై మంత్రి ఆగ్రహం
ఆంధ్రా పల్స్ - తెనాలి: తెనాలి ఆటోనగర్లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఘటన స్థలాన్ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్నిప్రమాదాల ప్రమాదం మరింత పెరుగుతోందని హెచ్చరించారు. వ్యాపారులు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా జ్వలనశీల పదార్థాలు, పెయింట్ థిన్నర్లు వంటి దహనశీల ద్రవాలను నియమాలకు అనుగుణంగా నిల్వ చేయాలని సూచించారు. ఆటోనగర్లో సుమారు 15 వేల లీటర్ల ఫ్లామబుల్...