ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

మెటా, అమెజాన్, జోహోతో భాగస్వామ్యాలు స్టార్టప్‌లకు కియా చేయూత డీప్ టెక్‌కు రూ.20 కోట్లు   ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ అవుట్‌పోస్టులను...