- విలేజ్ సర్వేయర్, వీఆర్‌ఓ సస్పెన్షన్
ఆంధ్రా పల్స్ – నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్ మరియు వీఆర్‌ఓ వెంకయ్యలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు.
పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
బాధితుల నుంచి ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కథనంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.