ప్రభుత్వ సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తా

అదనపు సంచాలకులు (ఇంచార్జి)గా బాధ్యతలు స్వీకరించిన పోతుల కిరణ్ కుమార్   ఆంధ్రా పల్స్ - విజయవాడ: ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడానికి కృషి చేస్తానని అదనపు సంచాలకులు (ఇంచార్జి)గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ తెలిపారు. సమాచార శాఖలో నిర్వహించిన ప్రతి బాధ్యత తనకు కొత్త అనుభవాన్ని, విలువైన పాఠాలను నేర్పిందన్నారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. కిరణ్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనకు అడిషనల్ డైరెక్టర్ (ఇంచార్జి)గా పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలోని...