ఆంధ్రా పల్స్
Date of Publish : 03 June 2026, 8:16 pm Posted by : ఆంధ్రా పల్స్

సమగ్ర అభివృద్ధి దిశగా గుంటూరు: జిల్లా కలెక్టర్

ఆంధ్రా పల్స్ – గుంటూరు: అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) వ్యవస్థను సమగ్రంగా ఏర్పాటు చేయడానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాన జంక్షన్ల ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణలో సమర్థత పెంచేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రజా సేవలు అందించడం, పరిశుభ్రమైన మరియు సుందరమైన నగర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గుంటూరు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.