ఫ్లిప్‌కార్ట్ ఇండియా పోస్ట్ భాగస్వామ్యం

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇండియా పోస్ట్ (India Post) మధ్య సరికొత్త భాగస్వామ్యం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇ-కామర్స్ సేవలను బలోపేతం చేయడం కోసం ఫ్లిప్‌కార్ట్, ఇండియా పోస్ట్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆధునిక సాంకేతికత, విస్తృతమైన సప్లై చైన్ (రవాణా) నెట్‌వర్క్ ఇండియా పోస్ట్‌కు చెందిన 1,50,000 కంటే ఎక్కువ పోస్టాఫీసుల నమ్మకమైన నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కామర్స్ యాక్సెస్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలవబోతోంది.