ఆంధ్రా పల్స్ – విజయవాడ: జగ్గయ్యపేట నుండి విజయవాడ వెళ్లే జగ్గయ్యపేట డిపో ఆర్టీసీ బస్సు గొల్లపూడి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంజన్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోనీ ప్రయాణికులు అందరినీ కిందకు దించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారూ. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.