రైతులు అవసరమైన మేరకే ఎరువులు వినియోగించాలి: జిల్లా కలెక్టర్
ఆంధ్రా పల్స్: రైతులు అవసరమైన పరిమితిలోనే ఎరువులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సూచించారు. రైతులకు ప్రత్యేక ఎరువుల కార్డులను జూన్ మొదటి వారంలో అందజేయనున్నట్లు తెలిపారు. అధిక ఎరువుల వినియోగం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు, ప్రకృతి వ్యవసాయ కిట్లను రైతులకు త్వరితగతిన పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన...