ఫైనాన్సియర్ల వేధింపులతో కుటుంబ హత్య, ఆత్మహత్య
ఆంధ్రా పల్స్ - వనపర్తి: వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫైనాన్సియర్ల వేధింపులను తట్టుకోలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నర్సింహులు (40) గత ఆరేళ్లుగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలోని సల్కిలాపురం గ్రామ శివారులో 52 ఎకరాల మామిడి తోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సుమారు...