పగలు ఇంజనీర్.. రాత్రి రైళ్లలో చోర్

రైల్వే ఉద్యోగి అరెస్ట్  కర్నూలులో సంచలనం ఆంధ్రా పల్స్ - కర్నూలు:  కర్నూలు జిల్లాలో రైల్వే శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్ ఒకరు రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణికుల లగేజీ దొంగతనం చేస్తూ పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. అనంతపురం జిల్లా యడికి మండలానికి చెందిన పి. బాలరాజు 2013లో రైల్వేలో ఉద్యోగం ప్రారంభించి, 2023లో జూనియర్ ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందాడు. గత రెండేళ్లుగా అదోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ, అదే సమయంలో రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు దొంగతనం చేస్తూ వచ్చాడని పోలీసులు...