ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల విప్లవం

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు వేగం పెరుగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఆధ్వర్యంలో పలు డిపోలు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు మారుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు–2, నెల్లూరు–2 డిపోలు తమ డీజిల్ బస్సులను ఇతర డిపోలకు తరలించి, ఎలక్ట్రిక్ బస్సుల డిపోలుగా మారె దిశగా ముందుకు సాగుతున్నాయి. మంగళగిరి డిపోలో ఇప్పటికే సగానికి పైగా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మర్చినట్లుగా సమాచారం. అనంతపురం, కడప, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి, కర్నూలు, సింహపురి, గాజువాక డిపోలలో ప్రతి డిపోకి 50 ఎలక్ట్రిక్...