ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ.22 వేల కోట్లు

ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. 18 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద సుమారు రూ.22 వేల కోట్ల ప్రణాళిక సిద్ధమైంది. శుక్రవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణపై అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,261 కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్లు, 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు పూలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ముదిగుబ్బ, తలుపుల,...